![]() |
![]() |
.webp)
అష్షు రెడ్డి స్పీడ్ మాములుగా లేదు. ముద్దులు, హగ్గులు అదరగొడుతోంది. రీసెంట్ జీ ఛానల్ సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 మొదలైన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనే సీరియల్స్ వాళ్లందరితో కర్టైన్ రైజర్ ఎపిసోడ్ ప్రసారమైంది. ఇక ఈ షోకి అష్షు రెడ్డి, యాంకర్ రవి హోస్ట్ చేస్తున్నారు. ఇక అష్షు దూకుడు మాములుగా లేదు.
.webp)
చామంతి సీరియల్ నుంచి సీనియర్ నటుడు ప్రభాకర్ వచ్చేసరికి ఇక అష్షు పాపా స్పీడ్ చూడాలి..ఒక తీన్ మార్ డైలాగ్ వదిలింది. "సినిమాల్లో నాకు క్రష్ ఆ మెగాస్టార్...టీవిలో నాకు క్రష్ ఈ మెగాస్టార్" అంటూ ప్రభాకర్ ని చిరంజీవితో పోల్చి ముద్దులు పెట్టి భుజం మీద వాలిపోయింది. ఇదంతా చూస్తున్న రవికి ప్రభాకర్ సర్ది చెప్పాడు. "నీ మనసులో ఏమనిపించిందో నువ్వు చేసావ్...తన మనసులో ఏమనిపించిందో తను చేసింది" అని చెప్పి వేల్లిపాయాడు. తర్వాత "ఎన్నాళ్ళో వేచిన హృదయం" సీరియల్ నుంచి చందు గౌడ, విశ్వా వచ్చి డాన్స్ వేశారు. ఇక అష్షు చందు గౌడాని చూసేసరికి పిచ్చ హ్యాపీగా ఫీలైపోయింది. ఇక చందు గౌడ కండలు లెక్కపెట్టి పక్కన నిలబడి కొత్త పెళ్లి కూతురిలా సిగ్గు పడిపోయింది. చందు కోసం తను ఒకటి ప్లాన్ చేసినట్టు చెప్పింది అష్షు. అలా చందు మీద ఒక కవిత చెప్పింది. " చందు తాగుదామా మనిద్దరం మందు..పెడతాను మీకు పెద్ద విందు...షూటింగ్ అయ్యాక వెల్దామా ఏదొక సందు" అనేసరికి అందరూ షాకయ్యారు. ఇక రవికి కోపం వచ్చి "ఇంకొక్క మాట మాట్లాడితే నీ నోట్లో కొడతా పురుగుల మందు" అన్నాడు. తర్వాత చందు గౌడా, అష్షు ఇద్దరూ కలిసి పీలింగ్స్ సాంగ్ కి డాన్స్ వేశారు.
![]() |
![]() |